Monday, December 23, 2024

బిసి బిల్లుకు మద్దతిస్తాం

- Advertisement -
- Advertisement -

We support the BC bill:Deve Gowda

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమవంతు కృషిగా చేస్తామని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అన్నారు. గురువారం మాజీ ప్రధాని దేవెగౌడ్‌తో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, బిసి సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, కర్రి వేణుమాధవ్, భూపేష్‌సాగర్, లింగయ్యయాదవ్, వెంకట్ యాదవ్, కట్ట బబ్లు గౌడ్, రవియాదవ్, దినేష్ పాల్గొని చర్చలు జరిపారు. 16 డిమాండ్‌లను దేవెగౌడ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ 74 సంవత్సరాల తర్వాత కూడా బిసిలకు దేశంలో న్యాయం జరగడం లేదన్నారు. బిసిలలో చాలా కులాలు ఇప్పటికీ సంచార జాతులు, భిక్షాటన చేసే కులాలు ఉన్నవి. ఈ కులాలకు ప్రజాస్వామ్యబద్ధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో వాటా దక్కలేదు. ఇప్పటికైనా – ఎప్పటికైనా ఇవ్వక తప్పదని దేవెగౌడ అన్నారు. ఆర్.కృష్ణయ్యను బిసిల సమస్యలపై 45 సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు అంకితభావంతో చేస్తున్నందుకు దేవెగౌడ అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News