Thursday, January 23, 2025

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటాం

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనా విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని వమ్ముచేయబోమని, కడుపులో పెట్టి కాపాడుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ఆదివారం నారాయణగూడలోని మార్వెల్ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ నాయకులు నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని రాజ్‌మల్లా , ఆదర్శబస్తీలు ఇతర బస్తీల నుండి దావాపు 200 మంది యువకులు, మహిళలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే దానం నాగేందర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు కెసిఆర్ నాయకత్వ వర్థిల్లాలి.. బీఆర్‌ఎస్ జిందాబాద్ … దేశ్ కీనేత కెసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారిని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా మారిపోయిందని తెలిపారు. తెలంగాణాలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. తెలంగాణ మోడల్ దేశవ్యాపితం కా వాలన్నదే కెసీఆర్ ఆకాంక్ష అన్నారు. కాంగ్రెస్, బీజేపి పార్టీల పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈ పథకాలు లేవని వెల్లడించారు.

దళిత బంధు, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, గృహలక్ష్మి, మహిళలకు వడ్డీలేని రుణాలు, పింఛన్లు, మైనారిటీలకు లక్ష, బీసీలకు లక్ష,డబుల్ బెడ్‌రూం ఇండ్లు వంటి పథకాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ పేదలకు అండగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు. వచ్చేనెల 2 నుంచి డబుల్ ఇండ్ల పంపకం జరగనున్నదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 12వేల వినతిపత్రాలు వచ్చాయని వీరందరికి డిసెంబర్‌లోపు డబుల్ ఇండ్లు ఇస్తామని పేర్కొన్నారు. వచ్యేనెలలో 1500 మందికి ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. అనంతరం సంతోష్‌గుప్తా పర్యవేక్షణలో కార్యకర్తలు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు యాదగిరి పటేల్ సుతారి, అవినాశ్, సాయిబాబా, శివప్రసాద్, గణేష్,ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ కుమార్, సెక్రటరీ మర్రి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News