Tuesday, November 5, 2024

మేం తీసుకోవడం వల్ల పేద దేశాలకు ఇబ్బంది కలగదు: బ్రిటన్

- Advertisement -
- Advertisement -

we take covishield won't impact on Poor countries: Britain

లండన్: కోటి డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) తమ దేశానికి సరఫరా చేయడం వల్ల పేద దేశాలకు జరగాల్సిన సరఫరాలపై ప్రభావం చూపబోదని బ్రిటన్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంచార్జ్‌మంత్రి నదీమ్ జహావీ హామీ ఇచ్చారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఎస్‌ఐఐ తయారు చేస్తోంది. దాంతో, తమ దేశానికి అవసరమైన వ్యాక్సిన్‌ను ముందుగా సరఫరా చేయాలని ఆ సంస్థల నుంచి బ్రిటన్ హామీ తీసుకున్నది. అదే విషయాన్ని అంగీకరిస్తూనే ఎస్‌ఐఐ తమకు కోటి డోసులు సరఫరా చేయడం వల్ల పేద దేశాలకు ఇబ్బంది ఉండదని బ్రిటన్ మంత్రి వివరణ ఇచ్చారు.
ఎస్‌ఐఐ నుంచి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను పేద దేశాలకు సరఫరా చేయాలన్నది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో చేపట్టిన కోవాక్స్ కార్యక్రమంలోని లక్షం. దాంతో, ఎస్‌ఐఐ నుంచి బ్రిటన్‌కు పెద్దమొత్తంలో వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయడం పట్ల కోవాక్స్‌లో భాగస్వామిగా ఉన్న స్వచ్ఛంద సంస్థ ఎంఎస్‌ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో, బ్రిటన్ మంత్రి వివరణ ఇచ్చారు. ఇప్పటికే బ్రిటన్‌లో 2కోట్ల 13 లక్షలమంది వయోవృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు టీకాలిచ్చారు. ఈ ఏడాది జులై చివరి వరకల్లా తమ దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.

we take covishield won’t impact on Poor countries: Britain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News