Sunday, December 22, 2024

విడిపోయినా కుటుంబంగానే ఉంటున్నాం: నటాషా

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ కీలక కామెంట్స్ చేసింది. తాను, హార్దిక్ విడిపోయినా ఇండియాలోనే ఉండటానికి కారణం తన కొడుకేనని చెప్పింది.  తన కొడుకు అగస్త్య కోసమే తానింకా ఇక్కడే ఉంటున్నట్లు నటాషా తెలిపింది. అగస్త్యను వదిలి తిరిగి సెర్బియా వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘హార్దిక్, నేను విడిపోయినా అగస్త్య కోసం కుటుంబంగానే ఉంటున్నాం. అతడు మా ఇద్దరి ప్రేమ పొందాలనుకుంటున్నాడు. అగస్త్య నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఒక తల్లికి తనకొడుకు సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదు’ అని నటషా రాసుకొచ్చింది.

కాగా, హార్దిక్, నటషా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కొడుకు పుట్టిన తర్వాత కొన్ని రోజులుగా దూరంగానే ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో నటషా తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఇద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరిగింది. చివరికి తాము విడాకులు తీసుకున్నట్లు హార్దిక్, నటషా ఇద్దరు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News