Monday, January 20, 2025

ఆదిలాబాద్‌లో సిసిఐ పునరుద్దరించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Tollywood praises on Minister KTR, Telangana govt

హైదరాబాద్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం తెలంగాణ రాష్ట్రం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిసిఐ ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కేంద్రం అమ్మేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఆదిలాబాద్‌లో సిసిఐ పునరుద్దరించాలని చాలాసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆదిలాబాద్‌లో సిర్పూర్ పేపర్ మిల్లును ప్రారంభించిన చరిత్ర తమదని కెటిఆర్ గుర్తు చేశారు. సింగరేణిని క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలకు కేంద్రం తెరలేపిందని, ఆదిలాబాద్‌లో సిసిఐ ఏర్పాటు కోసం ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News