Saturday, January 11, 2025

పార్లమెంటు భవనం నుంచి వేలాడిన జెపిసి బ్యానర్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వివిధ ప్రతిపక్ష నాయకులు మంగళవారం పార్లమెంట్ హౌస్ కారిడార్‌లో తమ నిరసన ప్రదర్శించారు. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) కోరుతూ నినాదాలు చేశారు. అంతేకాక ‘వి వాంట్ జెపిసి’ అన్న బ్యానర్‌ను పార్లమెంటు భవనం నుంచి వేలాడదీశారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ భవన సముదాయంలో వేరేగా నిరసన తెలిపింది. అదానీ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ తన మౌనాన్ని వీడాలని డిమాండ్ చేసింది. వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ప్రభుత్వం సాయపడుతోందని ఆరోపించింది. అందుకే మోసపు ఆరోపణలు వచ్చినా దర్యాప్తుకు ఆదేశాలివ్వడంలేదని పేర్కొంది. అదానీని అరెస్టు చేయాలని టిఎంసి పార్టీ కోరింది.

దీనికి ముందు ప్రతిపక్షాలకు చెందిన నాయకులంతా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో సమావేశమై అదానీ అంశంపై జెపిసి దర్యాప్తుకు ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. కాంగ్రెస్, డిఎంకె, ఆర్‌జెడి, సిపిఐఎం, సిపిఐ, ఎన్‌సిపి, శివసేన(యుబిటి), జెడియూ, జెఎంఎం, ఐయూఎంఎల్, ఆప్, ఎండిఎంకె ప్రతిపక్ష నాయకులంతా ప్రతిపక్ష నాయకుడు అయిన మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

ఇదిలావుండగా పార్లమెంటు ఉభయసభలు గలాభా మధ్య మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు అదానీ గ్రూప్‌పై దర్యాప్తుకు, అధికార పక్షం రాహుల్ గాంధీ క్షమాపణలు కోరాలంటూ రెచ్చిపోయాయి. కాగా అదానీ గ్రూప్ మాత్రం తామేమి తప్పు చేయలేదని ఖండిస్తోంది. జెపిసి దర్యాప్తు జరిగితే కదా వాస్తవం తెలిసేది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News