- Advertisement -
హైదరాబాద్: మారణహోమాన్ని సృష్టించిన దోషులకు ఉరే సరైన శిక్ష అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్పందించిన కిషన్ రెడ్డి.. ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని చెప్పారు. 12 ఏళ్లుగా ఈ ఘటన ఓ పీడకలలా వెంటాడుతోందని, ఈ తీర్పుతో బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని భావిస్తున్నానని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు మేము అండగా ఉంటామని కిషన్ రెడ్డి మాట ఇచ్చారు.
- Advertisement -