Saturday, November 16, 2024

మేం మోసపోయాం.. మీరు మోసపోవద్దు

- Advertisement -
- Advertisement -

నిరంతరం కరెంటు ఇస్తామన్నారు, మూడు గంటలు కూడా ఇవ్వడం లేదు ఎండుతున్న
పైర్లు, రైతు గోస పట్టని కర్నాటక పాలకులు

మహిళలకు ప్రాణసంకటంగా మారిన ఉచిత ప్రయాణం ఇప్పటికే ఆచూకీ లేకుండా
పోయిన రెండు వందల మంది బాలికలు

గద్వాలలో నిర్వహించిన ధర్నాలో రాయచూర్ జిల్లా రైతు సంఘం నేతలు

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: కర్నాటకలో కాంగ్రెస్‌పార్టీ  రైతులను మోసం చేసిందని ఆ రాష్ట్ర అన్నదాతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ చెబుతున్న కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్ద ని తెలంగాణ రైతులను హెచ్చరించారు. ఇటీవల కర్నాటక అసెంబ్లీకి ఎన్నికల జరిగినపుడు కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలన్నీ అటకెక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ చౌరస్తాలో రాయచూర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి మాట్లాడుతూ మా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకముందు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలలో రైతులకు నిరంతరం కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి మా ఓట్లు దండుకొని ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని అలాంటి జూటా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర రైతులు నమ్మి మోసపోవద్దని అన్నారు.

ఇప్పుడు మా పొలాలన్ని ఎండిపోయి చివరికి పొట్ట చేత పట్టుకొని వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని తెలిపారు. అన్ని ఉచితలు ఇస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి ఉచితాలు ఇవ్వడం లేదని అన్నారు. ఉచిత ప్రయాణం అంటూ మ హిళలకు ఆశ చూపారని అయితే ఆధార్ కార్డు చూపి ప్రయాణించిన అనేక మంది బాలికలు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని ఆరోపించారు. కనీసం రెండు వందల మంది ఇలా అదృశ్యమయ్యారని ఆగ్రహించారు. గృహలక్ష్మీ పథకం అంటూ చెప్పి హామీగానే నిలబడిందన్నారు. విద్యుత్ కోత అధికమై రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని మేము వారి మాటలకు మోసపోయామని అ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇస్తూ ఆదుకుంటున్నాడని తెలిపారు. మా లాగా మీరు మోసపోకుండా ఉండాలని వారు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News