Saturday, November 23, 2024

31 డెడ్‌లైన్‌కే కట్టుబడి ఉంటాం

- Advertisement -
- Advertisement -

We will adhere to the Aug 31 deadline:Biden

అఫ్ఘన్‌నుంచి అమెరికన్ల తరలింపుపై బైడెన్ తాజా నిర్ణయం

వాషింగ్టన్: అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా పౌరులు, అఫ్ఘన్ మిత్ర దేశాలకు చెందిన ప్రజలను ఖాళీ చేయించడానికి గడువును ఆగస్టు 31 తర్వాత పొడిగించరాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించినట్లు ఆయన ప్రభుత్వంలో అధికారి మంగళవారం ఒకరు చెప్పారు తన జాతీయ భద్రతా బృందంతో చర్చించిన తర్వాత బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గడువును మించి అఫ్ఘన్‌లో అమెరికా బలగాలను ఉంచడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలన్నిటినీ బేరీజు వేసిన తర్వాత వచ్చే మంగళవారం నాటికే పౌరుల తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ అధికారి చెప్పారు.

ఈ నెల 15న తాలిబన్లు అఫ్ఘన్‌ను అధీనం చేసుకోవడానికి ముందు అక్కడినుంచి తన బలగాలను, పౌరులను పూర్తిగా తరలించడానికి బైడెన్ పెట్టుకున్న గడువు ఇదే కావడం గమనార్హం. ఒక వేళ ఈ గడువును కొద్దిగా పెంచాల్సివస్తే కంటింజెన్సీ(తాత్కాలిక) ప్రణాళికలను సిద్ధం చేయాలని కూడా బౌడెన్ తన జాతీయ భద్రతా బృందాన్ని ఆదేశించారని ఆ అధికారి చెప్పారు. అఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లనుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన హెచ్చరికలు, వచ్చే మంగళవారం నాటికి అమెరికన్లతో పాటుగా అఫ్ఘన్ మిత్ర దేశాలకు చెందిన అందరినీ తరలించని పక్షంలో తాను విధించుకున్న గడువును పొడిగించడానికి తాలిబన్లు అంగీకరించే అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత అఫ్ఘన్‌నుంచి తమ పౌరులను ఖాళీ చేయించే పనులను అమెరికా వేగవంతం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News