‘దళిత గిరిజన దండోరా సభ’ను ఇక్కడే నిర్వహించుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మట్టికి గొప్పతనం ఉందన్నారు. ఇక్కడ వేసే అడుగులో పోరాట పటిమ ఉందన్నారు. చరిత్ర పుటలో పౌరుషం గురించి చర్చించాలంటే రాంజీగోండ్ గురించి ప్రస్తావించాలని చెప్పారు. రాంజీగోండ్ పోరాట స్పూర్తిని ఆర్శంగా తీసుకున్నాని రేవంత్ తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడ్డ ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అందులో భాగంగానే శుక్రవారం రూ 60 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధివైపు నడిపించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. గూడేలకు రోడ్లు, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. అమరవీరుల స్తూపం సాక్షిగా కెసిఆర్ పాలనను అంతం చేశామని చెప్పారు. కెసిఆర్ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా? అని ప్రశ్నించిన సిఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.