Monday, December 23, 2024

ఉప చట్టం రద్దయ్యే దాకా ఉద్యమిస్తాం : ఫ్రొఫెసర్ హరగోపాల్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉప లాంటి చట్టాలు ఉండాల్సినవి కావని, ఉప చట్టం రద్దయ్యే వరకూ ఉద్యమిస్తామని నిర్భంద వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఉప చట్టం రద్దు చేయాలని, ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిర్భంద వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్ టేండ్ సమావేశం జరిగింది. వేదిక కోకన్వీనర్ ప్రొ. గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హరగోపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామిక, మానవీయ విలువల ను తెలంగాణలో కల్పించా ల్సిన బాధ్యత ఇక్కడి ప్రభుత్వంపై ఉందన్నారు. తాడ్వాయి కేసులో 152 మందిపై ఉప చట్టం కింద అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఉద్యమకారులపై గత ప్రభుత్వాలు ప్రవర్తించినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవహారిస్తోందని విమర్శిం చారు. ఉప చట్టాన్ని రద్దు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మానిఫేస్టోలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజా స్వామ్యయుత వాతావరణం నెలకొల్పాలని అన్నారు. తన ఒక్కడిపై మాత్రమే కాకుండా ఉద్యమకారుల అందరిపై ఉప చట్టంతో పాటు ఇతర అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. ఉప లాంటి నిర్భంద చట్టాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తామని హెచ్చరిం చారు.

పౌర హక్కుల సంఘం నాయకులు రవిచంద్ర మాట్లాడుతూ ఉప చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్దంగా ఉందనే విష యాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. విమలక్క మాట్లాడు తూ తెలంగాణలో ఉప చట్టాన్ని అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. సమావేశంలో పివోడబ్లూ జాతీయ కన్వీనర్ వి. సంధ్య, ప్రొఫెసర్ పద్మజాషా, రాఘవాచారి, పిడిఎం రాజు, బల్ల రవీందర్, పికేఎం జాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News