Saturday, November 16, 2024

కింగ్ కోఠి ప్యాలెస్‌పై సుప్రీంను ఆశ్రయిస్తాం

- Advertisement -
- Advertisement -

We will approach the Supreme Court on King Kothi Palace

పునర్నిర్మాణ పనుల నిలిపివేతకు
పిటిషన్లు అందులో నిజాం నవాబ్
వాడిన అరుదైన వస్తువులు ఉన్నట్లు
మా పూర్వీకులు చెప్పారు ఏడో నిజాం
ముని మనవడు హిమాయత్ అలీ మీర్జా

మన తెలంగాణ/హైదరాబాద్ : కింగ్‌కోటి ప్యాలెస్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించనున్నట్లు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముని మనుమడు హిమాయత్ అలీ మీర్జా ప్రకటించారు. నజ్రీబాగ్ వద్ద గల కింగ్‌కోఠి ప్యాలెస్‌లో అన్ని రకాల నిర్మాణాలు, పునర్నిర్మాణ పనులను నిలిపివేయడానికి స్టే మంజూరు చేయాలని సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. కింగ్ కోటి ప్యాలెస్‌లోని అండర్ గ్రౌండ్ సెల్లార్‌ల్లో అరుదైన పత్రాలు, విలాసవంతమైన ఫర్నిచర్, ఆభరణాలు, ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన అరుదైన వస్తువులు ఉన్నాయని తన కుటుంబ పెద్దలు చెప్పారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కింగ్‌కోటి ప్యాలెస్, నజ్రీబాగ్ ట్రస్ట్‌లను కొనుగోలు చేశానని చెబుతున్న వ్యక్తి నుంచి పూర్తిగా హ్యాండోవర్ చేసుకుంటానని హిమాయత్ అలీ మీర్జా చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లే ముందు ఈ ప్యాలెస్‌లో ఏ భాగం గానీ దెబ్బతినొద్దని, మార్చొద్దని స్పష్టం చేశారు. కింగ్ కోటి ప్యాలెస్‌ను విక్రయించారని పలువురు వ్యక్తులు చేస్తున్న ప్రకటనలు సంక్షోభ పూరితంగా ఉన్నాయని, వాటిపై దర్యాప్తు చేయాలని సిబిఐ, సిఐడిలకు పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. విదేశాల్లోని ప్రభుత్వాల మాదిరిగా వారసత్వ కట్టడాలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News