గద్వాల ప్రతినిధి: తాను ఏ పార్టీలో గద్వాల ప్రజలకు అం దుబాటులో ఉండి, గద్వా ల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని బిజెపిపార్టీ జాతీ య ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నా రు. బుధవారం గద్వాల పట్టణంలోని ఆమె నివాసంలో బిజెపి ముఖ్య కార్యక ర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ… గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు గద్వాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని తెలిపారు.
నాడు ఆర్‌డీయస్ నీటి కోసం ప్రాణాలు ఫనంగా పెట్టి కొట్లాడి నని గుర్తు చేశారు. నెట్టెంపాడు కోసం హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి నెట్టెంపాడు ప్రాజెక్టును సాధించుకున్నామని, దీంతో గూడెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్‌లు తమ హాయంలో పూర్తి చేయ డంతోనే నేడు వ్యవసాయానికి సాగునీరందుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ 9 ఏళ్ల పాలన లో నెట్టెంపాడు ప్రాజెక్టు కాలువలు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు.
గ్రామాలలో అభివృద్ధి కుం టుపడిందని, గ్రామాలల్లో బీఆర్‌ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో నడిగడ్డలో జరిగిన అభివృద్ధి శూన్యమని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ పార్టీతో సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కార్యకర్తలు, నాయకులు సిద్ద ంగా ఉండాలని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, పన్నా ప్రముఖులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు, బూతు అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.