Monday, December 23, 2024

ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులందర్నీ వెనక్కి తెస్తాం : మోడీ

- Advertisement -
- Advertisement -

We will bring back all Indians stranded in Ukraine: Modi

బస్తి (ఉత్తరప్రదేశ్): యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులందర్నీ వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ చెపారు. ఉత్తరప్రదేశ్ లో మార్చి 3 న జరగనున్న ఆరోవిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని బస్తిలో ఆదివారం ఏర్పాటు చేసిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. దేశభక్తికి, పరివార్ భక్తి (కుటుంబ భక్తి) కి చాలా తేడా ఉందని అన్నారు. గత కుటుంబ పాలకులు రక్షణావసరాల కోసం విదేశాలపై ఆధారపడేవని, కానీ ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్‌కే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, కులమతాలకు అతీతంగా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా రూపొందించే సమయమిదేనని మోడీ చెప్పారు. “ మనకు ఆయిల్ రిఫైనరీలు లేవు. క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు చెరకు సాయంతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాం. దశాబ్దాలుగా పరివార్‌వాదీలు మన సైన్యాన్ని ఇతర దేశాలపై ఆధారపడేలా చేశారు. కానీ ఇవాళ యూపీలో మేము రక్షణ కారిడార్ ఏర్పాటు చేశాం ” అని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News