Wednesday, January 22, 2025

సకాలంలో స్పందించాం

- Advertisement -
- Advertisement -

We will bring stricter regulations on digital loans

తొందరపడితే ఆర్థికంగా వినాశకర పరిస్థితులు
వడ్డీ రేట్లను పెంపు విషయంలో తగ్గేదిలేదు
డిజిటల్ రుణాలపై కఠిన నిబంధనలు తెస్తాం
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్

ముంబై : ద్రవ్యోల్బణం నియంత్రణ విషయంలో ఆర్‌బిఐ సకాలంలో స్పందించిందని, ఏమాత్రం తొందరపడినా ఆర్థికంగా వినాశకర పరిస్థితులు తలెత్తేవని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లను పెంచడంలో రిజర్వు బ్యాంక్ వెనకడుగు వేయడం లేదని, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. దేశీయ ఆర్థిక వృద్ధికి దోహదం చేసే చర్యలు చేపట్టామని, కరోనా మహమ్మారి సమయంలో వృద్ధికి ఊతమిచ్చే అనేక చర్యలు చేపట్టిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు. అయితే వడ్డీ రేట్ల పెంపులో ఆలస్యం కారణంగా ఆర్‌బిఐ విమర్శలను ఎదుర్కొంటోంది. దీనిపై దాస్ స్పందిస్తూ, వడ్డీరేట్ల పెంపులో ఆర్‌బిఐ వెనుకబడిందనే అభిప్రాయానికి తాను ఏకీభవించబోనని అన్నారు. వడ్డీ రేట్లను పెంచకుంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణం మరింత పెరిగేదని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఆర్‌బిఐ రెపో రేటును రెండు దశల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచింది.

దీంతో రెపో రేటు 4 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగింది. ఆర్‌బిఐ మళ్లీ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని భావిస్తున్నారు. అలాగే సురక్షితమైన డిజిటల్ రుణాల కోసం త్వరలో కొత్త నిబంధనలను జారీ చేస్తామని ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. రుణాలు ఎగవేసే వారిపై కఠిన నిబంధనలు తీసుకొస్తామని అన్నారు. ఈ నెల ప్రారంభంలో ఆర్‌బిఐ ఎంపిసి వడ్డీ రేటును పెంచింది. రెపో రేటును 0.50 శాతం పెంచడంతో మొత్తం రేటు 4.90 శాతానికి చేరింది. ఎంపిసి (ద్రవ్యవిధాన సమీక్ష కమిటీ)లోని ఆరుగురు సభ్యులు వడ్డీ రేటు పెంపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అంతకుముందు మే నెలలోనూ ఆర్‌బిఐ 0.40 శాతం రెపో రేటును పెంచగా, మళ్లీ ఐదు వారాల్లోనే 0.50 శాతం రేటును పెంచుతూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటుపై కఠినంగా ఉండేందుకు ఆర్‌బిఐ సర్దుబాటు వైఖరిని మార్చుకోవాలనుకుంటోంది. 202223 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 5.7 శాతం నుంచి 6.7 శాతానికి సవరించింది. కానీ వృద్ధి రేటు అంచనాను మాత్రం 7.2 శాతం వద్ద గతంలో నిర్ణయించినదే కొనసాగించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News