శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో స్టేడియం నిర్మాణాకి 20 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై చైర్మన్ ఆనందం వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు. దీని కోసం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ లక్షమన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇక గజ్వేల్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామన్నారు. గజ్వేల్ ప్రాంతాన్ని స్పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్దాలని సిఎం ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా స్టేడియాన్ని నిర్మించడమే లక్షంగా పెట్టుకున్నామని చైర్మన్ స్పష్టం చేశారు.