Monday, December 23, 2024

దమ్ముంటే జైల్లో వెయ్

- Advertisement -
- Advertisement -
We will case in Supreme Court over Raphael flights scandal:CM KCR
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా

కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం… నాకేం భయం లేదు. నన్ను కాదు…నేను మిమ్మల్ని జైలుకు పంపుతాను. కేంద్రంలో జరుగుతున్న మొత్తం అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. ప్రధానంగా రఫేల్ జెట్ విమానాల కొనుగోలులో పెద్దఎత్తున గోల్‌మాల్ జరిగింది. దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వాళ్లంతా మోడీ దోస్తులే. మన కంటే చౌకగా ఇండోనేషియా రఫేల్ విమానాలు కొన్నది. ఈకుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు…పాత్రధారులు బయటికి రావాలి.

ప్రధాని మోడీ పిచ్చిపిచ్చి అబద్ధాలు ఆడుతూ దేశాన్ని నాశనం చేస్తున్నారు
గోల్‌మాల్ మాటలతో దేశ ప్రజలను మోసం చేస్తున్న బిజెపిని దేశం నుంచి తరిమికొట్టాల్సిందే
సింగపూర్, చైనాల మాదిరిగా పరివర్తన రావాల్సిందే

దళితుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలంటున్నా

దేశ ప్రజల్లో ఇప్పుడిప్పుడే కదలిక వస్తోంది, త్వరలోనే దేశవ్యాప్తంగా కనపడుతోంది అవసరమైతే జాతీయస్థాయిలో కొత్త పార్టీకి సిద్ధం ట్రంప్ తరఫున అమెరికాలో మోడీ ప్రచారం చేయడమేమిటి? బిజెపి విద్వేషరాజకీయాల గురించి యువత ఆలోచించాలి శాంతిని కావాలా, ఘర్షణలు, కర్ఫూలు కావాలా? విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేసే కుట్ర సాగుతోంది

33మంది బ్యాంకులను ముంచి లండన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు విదేశాలకు పారిపోయినవారంతా మోడీ దోస్తులే అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడ్తా రాసిపెట్టుకోండి, యుపి ఎన్నికలు ముగియగానే మోడీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లను గణనీయంగా పెంచుతుంది

రాహుల్‌పై నీచంగా మాట్లాడతారా?
ఇదేనా మన ధర్మం, హిందూ సంస్కృతి?

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ పచ్చి…పిచ్చి అబద్దాలు చెబుతూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన చెప్పేది ఒకటి…చేసేది ఒకటిని ధ్వజమెత్తారు. యదేశ్చగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. గోల్‌మాల్ మాటలతో దేశ ప్రజలను మోసం చేస్తున్న బిజెపిని దేశం నుంచి తరిమి కొట్టాల్సిందేనని కెసిఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం కొత్త మార్గం పట్టాల్సిందేనని అన్నారు. సింగపూర్, చైనా మాదిరిగా దేశంలో పరివర్తన రావాల్సిందేనని ఆయన ఆకాంక్షించారు. అందుకే దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమన్నారు. దీనిపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో కదలిక వస్తోందని…త్వరలోనే ఆ మార్పు దేశ వ్యాప్తంగా కనపడుతుందన్నారు. దీని కోసం అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయడానికైనా తాను సిద్దమేనని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, నరేంద్రమోడీపై వరసగా మూడవ రోజు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.

ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరోసారి ఆగ్రహంతో రగిలిపోయారు. మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రతిష్టను దగిజార్చుతున్నాయని విమర్శించారు. ట్రంప్ తరఫున ప్రధాని ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు.ని అమెరికా ఎన్నికలు అంటే అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా? అని నిలదీశారు. ఈ విషయంపై మోడీ ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడిందన్నారు. ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధా ని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని చెప్పారు. మత పిచ్చితో దేశం సర్వనాశనం అవుతోందన్నారు, కర్ణాటకను కాశ్మీరం చేశారని మండిపడ్డారు. పెట్టుబడులు భయపడి వెనుకకు మళ్లిపోయేలా చేస్తున్నారన్నారు. కర్నాటకలో ముస్లిం ఆ డ పిల్లలపై రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని కాషాయ మూకలపై విరుచుకుపడ్డారు.

బిజెపి పాలనలో దేశంలో పదిహేను, పదహారు లక్షల పరిశ్రమలు మూ తపడ్డాయని, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో తాండవిస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీ విద్వేష రాజకీయాల గురించి యువత ఆలోచించాలన్నారు. శాంతిలేని చోట ఎవరు పెట్టుబడులు పెడతారని సిఎం కెసిఆర్ ప్ర శ్నించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగుల్చుతున్నారు? శాంతిభద్రతలు కోరుకుందామా? లేక ఘర్షణలు, కర్వ్యూలు కోరుకుందామా? అని నిలదీశారు. రాహుల్‌గాందీ పట్ల అస్సాం సిఎం చేసిన వ్యాఖ్యలు సమంజసమేనా? బిజెపి అగ్రనేతలు దీన్ని సమర్థిస్తారా? అని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అస్సాం సిఎంపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యల విషయాన్నీ కూడా వదిలిపెట్టబోనిని ఈ సందర్భంగా హెచ్చరించారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసే కుట్ర

విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవే టు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. అందులో భాగంగా ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు కేంద్రం పంపించిందన్నారు. ఆ బిల్లుపై ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కూడా చెప్పారన్నారు. అయితే బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నా రు. విద్యుత్ సంస్కరణలు వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మా నం చేసి పంపించామన్నారు. సంస్కరణలు అమలు చేస్తే అరశాతం… ఎఫ్‌ఆర్‌బిఎం ఐదేళ్ల పాటు ఇస్తామన్నారు. విద్యుత్ సంస్కరణలకు అదనపు రుణాలు తీసుకుంటున్నారు. అదనపు రుణాల విషయమై కేంద్ర బడ్జెట్లో కూడా చెప్పారన్నారు. కేంద్ర ముసాయిదా బిల్లుకు ఎపి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 25వేల వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టారన్నారు. మిగతా విద్యుత్ మీటర్లకు రూ. 737 కోట్లతో టెండర్లు పిలిచారన్నారు. కేంద్రం చెప్పినట్టు విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో రూ.5వేల కోట్లు నష్టపోయే అవకాశముందన్నారు.

అయినా సరే, మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పామన్నారు. చరిత్రను కప్పిపుచ్చి బిజెపి నేతలు గోల్ మాల్ చేస్తున్నారని విమర్శించారు. బహిరంగ సభల్లో అన్ని విషయాలు చెప్పలేం. విద్యుత్ సంస్కరణలు అమలు చే యమని కేంద్రం చెప్పినట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారన్నారు. ఇవిగో ఆధారాలు.. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాగు కోసం కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానమన్నారు. వందశాతం మీటరింగ్‌పై డిస్కులలు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఏడాదిలోగా విద్యుత్ మీటర్లు పెట్టాలన్నారని సిఎం వెల్లడించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి బిజెపి వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు చ దువు వచ్చో రాదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

మోడీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి

నిన్న, మొన్న తాను జనగామ, యాదాద్రి జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్లు ప్రారంభించుకున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి మా ట్లాడానని.. బహిరంగ సభల్లో అన్ని విషయాలు మాట్లాడలేమన్నారు. కొన్ని విషయాలనే ప్రజలకు స్పష్టం చేశానని అన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని మండిపడ్డారు, విద్యుత్ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారన్నారు. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శా తం ఎఫ్‌ఆర్‌బిఎం అదనంగా ఇస్తామంటున్నారని పేర్కొన్నా రు. రాష్ట్రంలోవిద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారన్నారు. దీని వల్ల రాష్ట్రానికి రూ. 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా తాను మీటర్లు పెట్టడానికి అంగీకరించలేదన్నారు. సెక్టార్‌లో సవరణలు వెనక్కి తీసుకోవాలని గతంలో ప్రధానమంత్రికి లేఖలు రాసినట్లు పేర్కొన్న సిఎం కెసిఆర్ అసెంబ్లీలో చేసిన తీర్మాణాన్ని కేంద్రానికి పంపిన ప్రతులను మీడియాకు చూపించారు.

దేశానికి మోడీ పాలన అవసరం లేదు

దేశానికి మోడీ పాలన అవసరం లేదన్నారు. ఆయన కరెక్టుగా ఉంటే రైతులకు ఎందుకు క్షమాపణలు చెబుతారన్నారు. అం తకుముందు గోద్రా అల్లర్లలోనూ ముస్లింలకు ఇలాగే క్షమాపణలు చెప్పారని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. ప్రధానికి క్షమాపణ రాజకీయాలు బాగా అలవాటయ్యాయన్నారు. బిజెపి ప్రభుత్వం హయాంలో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందన్నారు. మోడీకి దమ్ముంటే దేశాన్ని సింగపూ ర్, చైనా లాగా దేశాన్ని అభివృద్ధి చేయండి. కానీ ఈ ప్రభుత్వానికి ఇవేవీ చేతకావడం లేదు. అందుకే ఆయన పాలన అవసరం లేదని అని కెసిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జైలంటే దొంగలకే భయం

కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి తనను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారని సి ఎం కెసిఆర్ అన్నారు. జైలంటే దొంగలకు భయమని… తన కేం భయం లేదన్నారు. తనను కాదు…నేను మిమ్మల్ని జైలుకు పంపుతానని హెచ్చరించారు. కేంద్రంలో జరుగుతున్న మొత్తం అవినీతి చిట్ట తన దగ్గర ఉందన్నారు. ప్రధానంగా రఫేల్ జెట్ విమానాల కొనుగోలులో పెద్దఎత్తున గోల్‌మాల్ జరిగిందన్నా రు. దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వా ళ్లంతా మోడీ దోస్తులేనన్నారు. కంటే చౌకగా ఇండోనేషి యా రఫేల్ విమానాలు కొన్నదన్నారు. ఈకుంభకోణంపై సు ప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రదారులు, బయటికి రావాలన్నా రు. అందులోని దొంగలు దేశానికి తెలవాల్సిందేనని అన్నారు.

అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడతా

33 మంది దేశంలోని వివిధ బ్యాంకులను ముంచి లండన్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నారని కెసిఆర్ అన్నారు. వారిలో మోడీ దోస్తులే చాలాఎక్కువ మంది ఉన్నారన్నారు. అందుకే బిజెపిని దేశం నుంచి తరిమికొట్టాలని చెబుతున్నామన్నారు. వాళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనమైపోతుందన్నారు. రఫేల్ జెట్ విమానాల కొనుగోలులో పెద్దఎత్తున గోల్‌మాల్ జరిగిందన్నారు. ఇందులో వేల కోట్లు మింగారని ఆరోపించారు. మనకంటే చౌకగా ఇండోనేషియా 48 రఫేల్ విమానాలను అతి త క్కువ ధరకే కొనుగోలు చేసిందన్నారు. ఈ అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడతానని అన్నారు. బిజెపి నేతలకు దమ్ముంటే వీటిపై మాట్లాడాలని కెసిఆర్ సవాల్ విసిరారు.

యుపి ఎన్నికల తర్వాత పెట్రోల్ రేట్లకు రెక్కలు

ఇప్పుడు చెబుతున్న రాసిపెట్టుకోండి! యుపి ఎన్నికలు ముగిసిన తెల్లారే మోడీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లను గణనీయంగా పెంచడం ఖాయమని సిఎం కెసిఆర్ జోస్యం చెప్పారు. బిజెపి తన నైతిక సిద్ధాంతాలను పూర్తిగా గాలికి వదిలిపెట్టిందన్నారు. ఇప్పుడున్న ని లుస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవకపోయినా సిగ్గులేని బిజెపి కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, అస్సాం తదితర రాష్ట్రాల్లో దొడ్డిదారిన పాలన సాగిస్తోందన్నారు. అలాగే మహారాష్ట్రలో కూడా పాలిద్దామని యత్నించి బోల్తా పడారన్నారు.

చందాలు ఇచ్చే వాళ్లకు ప్రోత్సాహం

బిజెపికి చందాలను ఇచ్చే వాళ్లను మోడీ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని కెసిఆర్ అన్నారు. వారి మెప్పు కోసం దేశాన్ని తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. వారి ప్రొద్భలంతోనే కేం ద్రం కొత్తగా విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని య త్నిస్తోందన్నారు. సంస్కరణలు అమలు చేస్తే రాష్ట్రంలోని లాండ్రీ, వస్త్ర పరిశ్రమ, పౌల్ట్రీ, వ్యవసాయానికి, ఎస్‌సిలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని పిలిస్తే బహిరంగ సభలో పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కరెంట్‌ను యూనిటుక్ రూ.11 చొప్పున కొని రూ.1.10కే రాష్ట్రాలకు ఇచ్చినట్టు చెప్పారన్నారు. కేంద్రం ఎప్పుడూ ఏ రాష్ట్రానికి కూడా రూ.1.10కు విద్యుత్ ఇవ్వలేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

ఒక్క బిజెపి నేత రాలే..

కేంద్రం చెబుతున్న అబద్ధాలపై దమ్ముంటే చర్చకు రావాలని తాను పలుమార్లు డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క బిజెపి నేత కూడా ముందుకు రాలేదన్నారు. దేశంలో 4లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో దానిని సద్వినియోగం చేసుకునే తెలివి కేంద్రానికి లేదన్నారు. విద్యుత్ లేక దేశంలో అంధకారంలో ఉంటోందన్నారు. తెలంగాణలో తప్ప 24 గం టల విద్యుత్ ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ ప్రైవేటీకరించాలనేది కేంద్రం ఉద్దేశమన్నారు. విద్యుత్ సంస్థలు నిర్మించినా ఉత్పత్తి కానివ్వట్లేదని మండిపడ్డారు. పార్టీలకు చందా ఇ చ్చే వాళ్లను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చం దాలు ఇచ్చే సంస్థల సోలార్ విద్యుత్ కొనాలంటున్నారు. ఆ విద్యుత్ కొనకపోతే జరిమానా విధిస్తామంటూ కేంద్రం చెబుతుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రభుత్వరంగం అదానీ, అంబానీ పరం

ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా మోడీ ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అదానికో, అంబానికో అప్పనంగా అప్పగిస్తోందని సిఎంకెసిఆర్ ఆరోపించారు. సుదీర్ఘ చరిత్ర వున్న భారతీ య రైల్వేలను ముక్కలు చెక్కలుగా చేసి ప్రైవేటు యాజమాన్యాల జేబుల్లో కుక్కడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజానీకం భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎల్‌ఐసి (జీవిత బీమా)ని ప్రైవేటుపరం చేయబోతున్నారన్నారు. క్రమక్రమంగా బ్యాంకులను కూడా ప్రైవేటీపరం చేసేందుకు మోడీ ప్రభుత్వం అనేక కుట్రలకు యత్నిసితోందని మండిపడ్డారు. అసలు పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడంటూ లేకుండా మొత్తం కేంద్రం తుడిచిపెడుతోందన్నారు.

విధిలేకనే మూడు చట్టాల రద్దు

గ్రామీణ జనాభాకు ప్రధాన ఉపాధి కల్పన రంగంగా ఉన్న వ్య వసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యంలోకి పంపించడానికే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. వీటిపై పార్లమెంటులో చర్చకు కూడా అవకాశమివ్వకుండా తనకున్న మూక బలంతో ఆదరాబాదరాగా శాస న రూపమిచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఆగమేఘాలపై దేశంలో అమలు చేసేందుకు యత్నించిందన్నారు. ఈ మూడు క్రూర చట్టాలను రైతులు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో భీష ణ పోరాటం చేయడంతో విధిలేగా కేంద్రం రద్దు చేసుకుందన్నారు. అప్పటికీ మోడీ ప్రభుత్వంలో పశ్చాత్తాపం కొంచెమైనా కనిపించకపోడం సిగ్గుచేటని విమర్శించారు.

కిషన్‌రెడ్డికి వార్నింగ్

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సిఎం కెసిఆర్ ఊరమాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు కేంద్ర బడ్జెట్ సరిగ్గా అవగాహన చేసుకోలేద ని అంటున్నారన్నారు. తనకు కాదు.. సరిగ్గా బడ్జెట్ అర్థ్ధం కాలేదని మండిపడ్డారు. బడ్జెట్‌లో రూ.34,900 కోట్ల ఎరువుల సబ్సిడి తగ్గించింది. అబద్దమా? ఉపాధి హామీ పథకానికి రూ.25వేల కోట్ల తగ్గింపు నిజం కాదా? అని కెసిఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన విషయం వాస్తవం కాదా?’ అని నిలదీశారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే కిషన్‌రెడ్డికి మర్యాద ఉండదని హెచ్చరించారు. ఇప్పుడు మర్యాదగా చెబుతున్నానని…ఇంకోసారి చె ప్పాల్సి వస్తే చాలా గట్టిగా చెప్పాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రం నుంచి ఒక్కగానొక కేంద్ర మంత్రిగా ఉన్నావ్… కాబట్టి మంచి గా ఉండు అని సూచించారు.

అవసరమైతే కొత్త పార్టీ

దేశ ప్రజల కోసం అవసరమైతే కొత్త పార్టీ పెట్టడానికి తా ను సిద్దమేనని కెసిఆర్ వెల్లడించారు. ఆ దమ్ము, రెండు తనకు ఉన్నాయన్నారు. అనేక అంశాల్లో దేశ ప్రజలను తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఈ పరిస్థితి ని సమూలంగా మారాల్సిన అవసరముందన్నారు. దీని కోసం కొత్త నాయకత్వం దేశానికి మరింత అవసరమన్నారు. హిజాబ్‌పై దేశం మొత్తం మౌనం వహిస్తోందన్నా రు. కర్ణాటకలోని విద్వేషం అంతటా వస్తే దేశం గతేంటి? అనిప్రశ్నించారు. పేరిట అంతర్యుద్ధాలను ప్రో త్సహిస్తారా? అని నిలదీశారు. విద్వేష రాజకీయాలను మానుకోవాలని సూచించారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, సక్రమంగా పనిచేయడం లేదని సర్కారియా కమిషన్ చెప్పిందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. గవర్నర్ వ్యవస్థ. దుర్వినియోగం బిజెపి హయాంలోనే బాగా పెరిగిందన్నారు. ఇ ది దురదృష్టకరమని,ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సంయమనం పా టించాలన్నారు. ఒకరినొకరు గౌరవించాలన్నారు.

రాహుల్‌పై నీచంగా
మాట్లాడుతారా?

రాహుల్ గాంధీని పట్టుకుని అస్సాం సిఎం నీచంగా మాట్లాడుతారా? ఇదేనా హిందు సంస్కృతిని అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. మాట అనొచ్చునా? నరేంద్ర మోడీ…బిజెపి సంస్కారం ఇదేనా? మన హిందూ ధర్మం ఇదేనా? దేశం మర్యాద ఇదేనా? అంటూ నిలదీశారు ఒక నేతను పట్టుకొని ఏం మాటలు మాట్లాడున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అలాంటివి అడుగుతారా? అని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహు ల్ గాంధీ ఒక ఎంపినే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడన్నారు. ఆయనతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. కానీ వాళ్ల నాయనమ్మ, నాన్న ఈ దేశం కోసం చనిపోయారన్నారు. వాళ్ల తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేశారన్నా రు. కాంగ్రెస్ పార్టీతోనే తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ అస్సోం సిఎం రాహుల్‌ను సంబోధించే విధానం ఇది కాదన్నారు.

విదేశాలకు పారిపోయినోళ్లంతా
మోడీ దోస్తులే

దేశ సంపదను దోచుకొన్న విదేశాలకు పారిపోయిన వా ళ్లంతా దోస్తులేనని సిఎం కెసిఆర్ ఆరోపించారు. ఆర్ధిక నేరగాళ్లంతా ఆయనకు చుట్టాలేనని ఎద్దేవా చేశారు. మోడీ… ఇదేనా మీ దేశ భక్తి? అని ప్రశ్నించారు. అందుకే అంటున్నా ‘బిజెపి మస్ట్‌గో ’అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని తరిమికొట్టకపోతే దేశం సర్వనాశనమవుతుందన్నారు. మోడీ హయాంలో దేశంలో నిరుద్యో గం బాగా పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపు కొడుతోందని ఆరోపించారు. మోడీ పాలనలో 33మంది ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలిపారిపోయారు. వారిప్పుడు లండన్లో జల్సాలు చేస్తున్నారన్నారు. వీరిలో చాలామంది గుజరాతీయులేనిని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి చిట్టా అంతా వస్తోందన్నారు. త్వరలోనే రఫేల్ కుంభకోణంపై సుప్రీంలో కేసు వేస్తామన్నారు. ఇడి, సిబిఐ, సిఐడి పేర్లు చెప్పి తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. వారికి దొం గలు భయపడతారేమో.. తానేందుకు భయపడతాను? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ గోల్‌మాల్ మాటలతో దేశ ప్ర జలను మభ్యపెడుతున్నారన్నారు. ఆయన వాజ్‌పేయి సి ద్ధాంతాలను ఎప్పుడో గంగలో కలిపేశారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News