Saturday, December 21, 2024

విలీన గ్రామాల రూపురేఖలు మారుస్తాం..!

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: విలీన గ్రామాల రూపురేఖలను మార్చడమే తమ ప్రధాన లక్షమని కరీంనగర్ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి, 8వ డివిజన్ కార్పొరేటర్ సల్ల శారద రవీందర్‌తో కలిసి అల్గునూర్‌లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

అనంతరం మేయర్ మాట్లాడుతూ… 8వ డివిజన్‌లో దాదాపు రూ.63లక్షల నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీతో పాటు మంచినీటి పైప్‌లైన్ పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామనీ, రానున్న రోజుల్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కేడీసీసీబీ డైరెక్టర్, పొరండ్ల సింగిల్విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News