Wednesday, January 1, 2025

మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఐప్యాక్ కార్యాలయంలో జగన్‌ మాట్లాడుతూ… ఎపిలో మరోసారి వైసిపి ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పారు. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచామని… ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లే గెలుస్తామని జోస్యం చెప్పారు.

రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని .. ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేస్తామన్నారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందన్నారు. మరోసారి 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని జగన్ అన్నారు. ఎపి ఎన్నికల ఫలితాలు చూసి ప్రశాంత్ కిషోర్ షాకవుతారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏం లేదని.. వర్క్ అంతా టీమే చేస్తోందన్నారు. 2029లోనూ ఐప్యాక్‌ టీమ్‌తోనే పనిచేస్తానని సిఎం జగన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News