- Advertisement -
గణతంత్ర దినోత్సవం సంబురంగా జరుపుకోవాల్సిన రోజు గవర్నర్ రాజకీయ ప్రసంగం చేయడం సరైంది కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గవర్నర్ ఆ పదవిని దిగజార్చే విధంగా మాట్లాడడం బాధ్యతరహితమని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై ప్రభుత్వాన్ని గణతంత్ర దినోత్సవం రోజు కించరపరచడం సరికాదన్నారు.
గణతంత్ర దినోత్సవం రోజు సిఎస్ డిజిపిని పక్కన పెట్టుకుని రాష్ర్ట ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును రాజకీయాలకు ఉపయోగించడం తగదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, గవర్నర్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -