Friday, November 22, 2024

ఆదివాసీలను జనరల్ స్థానాల కేటాయింపు పరిశీలిస్తాం

- Advertisement -
- Advertisement -

ఆదివాసీ కాంగ్రెస్ మహాసభలో మాణిక్‌రావ్ ఠాక్రే

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదివాసీలకు వచ్చే ఎన్నికల్లో జనరల్ స్థానాలను కేటాయించడాన్ని పరిశీలిస్తామని ఎఐసిసి ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. ఆదివారం ఆదివాసీ కాంగ్రెస్ తెలంగాణ మహాసభ గాంధీ భవన్ ప్రకాశం హల్ లో జరిగింది ఈ సభలో మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ జనరల్ స్థానాలను ఆదివాసీలకు కేటాయించేందుకు పేర్లను ప్రతిపాదించాలని బలరాం నాయక్‌ను కోరారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి గిరిజనుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడిందని చెప్పారు. గిరిజన హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని, రిజర్వేషన్‌ల వల్ల గిరిజనులు అభివృద్ధి పథంలో ముందుకు వచ్చారనిచెప్పారు. సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినవేనని స్పష్టం చేశారు. బిజెపి విధానాలనే బిఆర్‌ఎస్ అమలు చేస్తుందని ఆరోపించారు. గిరిజనులు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆదివాసీ కాంగ్రెస్ పని చేయాలని కోరారు. 1070 చట్టం, జీవో నెంబర్ మూడు, అడవి హక్కుల చట్టాన్ని పిశా చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని తెలిపారు.
ఆదివాసీల మద్దతు చాలా గొప్పది : రోహిత్ చౌదరి
ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీల మద్దతు చాలా గోప్పదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రోహిత్ చౌదరి అన్నారు. అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లోను ఆదివాసీ గిరిజన నాయకులకు సమూచిత స్థానం కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆదివాసీల పాత్ర కీలకంగా ఉండనుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా సమిష్టిగా పాటుపడాలని సూచించారు.
సబ్ ప్లాన్ అమలు చేసింది కాంగ్రెస్తే : బలరాం నాయక్
దేశంలో ఆదివాసీ, గిరిజన తెగల అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ అమలు చేసిందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌షి, ఎస్‌టి లను విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, ఆదివాసీ లను మాయ మాటలు చెప్పి కాలం వెళ్ళాదిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన, హరిజన, దళితులకు సబ్ ప్లాన్ ద్వారా అధివృద్ధి ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. దేశంలో రాజీవ్ గాంధీ నుండి మొదలుకొని సోనియా గాంధీ రాహుల్ గాంధీ అందరూ కూడా ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనులందరు ఒక్క తాటిపైకి వచ్చి ఐక్యత తో ముందుకు సాగాలని సూచించారు. రానున్న రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోను పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. జనాభా ప్రతిపధికన రాష్ట్రంలో జారుగనున్న ఎన్నికల్లో సీట్లను కేటాయించాలని కోరారు.
ఆదివాసీలకు సముచిత స్థానం కల్పించాలి : బెల్లయ్య నాయక్
తెలంగాణ రాష్ట్రంలో 79 స్థానాల్లో గిరిజన, ఆదివాసీ ల ఓట్లు అభ్యర్థుల గెలుపుకు పాటుపడుతున్నాయని టిపిసిసి అదివాసీ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రల్లో ఆదివాసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారన్నారు. అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లోను ఆదివాసీలకు సమూచిత స్థానం కల్పించి ప్రోత్సహించాలని కోరారు. తెలంగాణలో ఆదివాసీ గిరిజనులందరు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో సoక్షేమ పథకాల అమలులోనూ ఆదివాసీ గిరిజనులకు మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరిలో ఆదివాసీ, గిరిజనులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
హక్కుల కోసం పోరాడాలి : రాములు నాయక్
ఆదివాసీలందరు ఐక్యతతో హక్కుల కోసం పోరాడాలని ఆదివాసీ నాయకుడు రాములు నాయక్ పిలుపునిచ్చారు. 2000-14 వరకు జరిగిన ఉద్యమంలో ఆదివాసీ, గిరిజనులందరు పాల్గొని రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములయ్యారని తెలిపారు. రాష్ట్రంలో సోనియా గాంధీకి కానుకగా రానున్న ఎన్నికల్లో ఆదివాసీలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సీట్ల కేటాయింపులో ఆదివాసీ గిరిజనులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్న తమకు 12 సీట్లు కేటాయిస్తే ఆదివాసీ నాయకులను గెలిపించి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రానున్న ఎన్నికల్లో ఆదివాసి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జనరల్ స్థానాల్లోను ఆదివాసీ, గిరిజనులకు పోటీ చేసేందుకు అవకాశం కలిపించాలని కోరారు.

Adivasi 1

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News