Wednesday, January 22, 2025

అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తాం

- Advertisement -
- Advertisement -
ప్రజా పార్టీ అధ్యక్షులు దాసరి అజయ్‌కుమార్

హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని యశోద నగర్ కాలనీలో ఆపార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా పార్టీ బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలును కేటాయించి ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే బీసిని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. రాష్ట్రంలో బిజేపి,బీ ఆర్ ఎస్,కాంగ్రెస్ పార్టీలు బీసీ డిక్లరేషన్ పేరుతో సభలు పెట్టడం కాదు. దమ్ముంటే కాంగ్రెస్,బిజేపి,బిఆర్ ఎస్ పార్టీలకు బీసీని సీఎం చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసే కుట్ర పన్నుతున్నారని బీసీ కులాల మధ్యన ఓట్ల బదలాయింపు జరగాలన్నారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రజా పార్టీ మారుతుందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో పేదలకు నేటికీ విద్య, వైద్యం ఉచితంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి పేదలకు ఉచిత విద్య, వైద్యంను అందిస్తామని, పేదల కష్టాలు పోవాలంటే ప్రజా పార్టీ తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెంట రమేష్ , అంజి యాదవ్,మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి,రాష్ట్ర నాయకులు రాగం సతీష్ యాదవ్,లక్ష్మయ్య గౌడ్,ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, ప్రశాంత్, నాగప్ప,మహేష్ యాదవ్ , రాములు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News