Monday, January 20, 2025

ఇక బిజెపితో తాడో పేడో తేల్చుకుంటాం

- Advertisement -
- Advertisement -
  • విలేకరుల ఇష్టాగోష్టిలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

మేడ్చల్ జిల్లా: బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ ను సందర్శించిన ఆయన విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈటెల రాజేందర్, వివేక్, కొండ విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి వారు బీజేపీ సిద్దాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శిక్షిస్తారని ఆశించి ఆపార్టీలో చేరారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ను శిక్షించనప్పుడు బీజేపీలో ఎందుకు ంటారని, ఇక బీజేపీతో తాడో పేడో తేల్చుకుంటారని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు.

మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలతో సమావేశం కావడం ఒప్పందంలో భాగమేనని ఆరోపించారు. కేటీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఒప్పందాలు, బేరసారాలను త్వరలో బట్టబయలు చేస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిని జిల్లా ప్రెస్‌క్లబ్ సభ్యు లు సత్కరించారు. మాజీ ఎంపీ మల్లు రవి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టి.మల్కయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, టీయుడబ్లూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు జి.బాల్‌రాజ్ గౌడ్, రాష్ట్ర నాయకులు ఎం.వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News