Friday, December 20, 2024

బిసి డిమాండ్లకు మద్దతివ్వని పార్టీలను ఓడిస్తాం

- Advertisement -
- Advertisement -

ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుకు దేశవ్యాప్త ఉద్యమం
ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన నేపధ్యంలో బిసి డిమాండ్లపై ప్రకటన చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం కాచిగూడలో జాతీయ బిసి సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బిసిల డిమాండ్‌లకు మద్దతివ్వని పార్టీలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తామని ప్రకటించారు. బిసిల డిమాండ్‌ల సాధనే లక్ష్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయని ఆయనన్నారు.

బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే ప్రధానమైన డిమాండ్ల డిమాండ్ల సాధన కోసం బిసి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని హైదరాబాద్ పర్యటనలో బిసి బిల్లు, కులగణన, ప్రత్యేక మంత్రిత్వ శాఖ తదితర అంశాలపై విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్లకు మద్దతు ఇవ్వని పార్టీలను ఓడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ రంగ సంస్థలలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, 1467 ఐఎఎస్, 964 ఐపిఎస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రైవేట్ రంగంలో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య కోరారు.

దేశానికి స్వాతంత్రం లభించి 76 సంవత్సరాలు గడిచినా రాజకీయరంగంలో బిసిల వాటా 15 శాతం దాటలేదన్నారు. ఉద్యోగుల వాటా 9 శాతానికి మించలేదని, 75 కోట్ల బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం కులగణన జరగకపోవడం బిసిల అణిచివేతకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News