Sunday, January 19, 2025

అధికారంలోకి రాగానే జనవరిలో రైతుబంధు వేస్తాం: రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి రాగానే జనవరిలో రైతుబంధు వేస్తామని, ఇప్పుడే రైతుబంధు వేయడం ద్వారా కౌలు రైతులు నష్టపోతారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో రేవంత్‌రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పార్టీల వారు కాంగ్రెస్ నేతలపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని, మాజీ ఐఏఎస్ ఏకే. గోయల్ ఇంట్లో రూ.300 కోట్లు ఉంటే వాటిని వదిలేసి తమ నాయకులపై లాఠీ ఛార్జి చేశారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

సీఈఓ వికాస్‌రాజ్‌కు తాను, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. బిజెపికి అనుబంధంగా ఈడీ, ఐటీలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బిజెపిలో ఉన్నన్నీ రోజులు ఆయా పార్టీల్లో ఉన్న నాయకులు మంచివారు అవుతారని, కాంగ్రెస్‌లో చేరగానే వారంతా రావణాసురులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News