- సాయుధ పోరాటం కమ్యూనిస్టులదే
- సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు
సంగారెడ్డి బ్యూరో: భారత్‌లో హైద్రాబాద్ సంస్థానం విలీనం కావడం కమ్యూనిస్టుల ఘనత అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి సాయుధ పోరాట వారోత్సవ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బివి రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎన్నికల భయం పట్టుకుందని, జమిలి ఎన్నికల నినాంద పేరుతో దేశంలో లొల్లి షురూ చేశారన్నారు. సెప్టెంబర్ 17 ఘనతను అన్ని పార్టీలు తాము సాధించామని చెప్పుకునేందుకు పోటీపడుతున్నాయన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారన్నారు.
జాతీయ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర బిజెపి దాని మాతృసంస్థలైన జన సంఘ్, ఆర్‌ఎస్‌ఎస్‌కు లేవన్నారు. ఇండియా , భారత్ రెండు పేర్లు రాజ్యాంగంలో ఉన్నాయని, ఇప్పుడు భారత్ పేరును మార్చాల్సిన వసరం ఎమొచ్చిందని ఆయన కేంద్రాన్నీ ప్రశ్నించారు. దేశంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, బిజెపి మాత్రం ప్రజలను గాలికొదిలేశి దేశం పేరు మారుస్తామని, సనాతన ధర్మం చట్టు చర్చలు జరిగేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
జి 20 దేశాల సమావేశాల్లో ప్రత్యేకత ఏమి లేదని, అన్ని దేశాల్లో రొటీన్‌గా జరిగే సమావేశాలేనని ఆయన కొట్టిపారేశారు. నిజాం లొంగిపోయేలా పోరాడిన కమ్యూనిస్టుల త్యాగాలను గుర్తించకుండా బిజెపి, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తాము ఎదో చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు దేశంలో పెరిగిన నిత్యావసరవస్తువుల ధరలు, మహిళ రిజర్వేషన్‌లు, కార్మికుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు, నాయకులు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, ప్రవీణ్‌కుమార్, యాదవరెడ్డి, నర్సింలు, రాజయ్య, ఆశోక్, పాండురంగారెడ్డి, కృష్ణ తదితరులున్నారు.