మహబూబ్‌నగర్ బ్యూరో : రాబోయే కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్టా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి అసెంబ్లీ ని యోజకవర్గంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సంచార వాహ నాల ద్వారా ఓటర్లలో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పిం చనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ తెలిపారు. శనివారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సము దాయ ఆవరణలో జిల్లాలోని మహబూబ్‌నగర్ , జడ్చర్ల, దేవ రకద్ర నియోజకవర్గాలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈవీఎంల ప్రదర్శన సంచార వాహనాలను ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేసే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎలా ఉపయోగించాలో ఈ వాహనాల ద్వారా ప్రత్యక్షంగా ఓటర్లకు చూపించడం జరుగు తుందని తెలిపారు. ఈ సంచార వాహనాల వల్ల పట్టణ ప్రాం తాలలో సైతం ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావు, ఆర్డీఓ అనిల్‌కు మార్, డిఆర్డిఓ యాదయ్య, హౌసింగ్ ఈఈ భాస్కర్, సమాచార శాఖ ఏడి వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ఏఓ శంకర్ , ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు అఖిల ప్రసన్న ఉన్నారు.