Wednesday, January 22, 2025

అతి త్వరలో మావోయిస్టుల అంతం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే దేశంలో నుంచి మావోయిస్టులను తుదముట్టిస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం విస్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి, మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరంతరం కార్యక్రమాలు సాగిస్తోందని అమిత్ షా ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టులను భద్రత బలగాలు కాల్చి చంపిన మరునాడు మంత్రి ఈ ప్రకటన చేశారు. ‘మావోయిస్టులపై కార్యక్రమాలు మున్ముందు కొనసాగుతాయని నమ్మకంగా చెప్పగలను. ప్రధాని మోడీ నాయకత్వంలో అతి త్వరలోనే మన దేశంలో నుంచి మావోయిస్టులను నిర్మూలించగలం’ అని అమిత్ షా తెలిపారు. మూడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 80 మందికి పైగా మావోయిస్టులను అంతం చేసినట్లు, 125 మందికి పైగా అరెస్టు చేసినట్లు, 150 మందికి పైగా లొంగిపోయినట్లు హోమ్ శాఖ మంత్రి తెలియజేశారు.

2014 నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధిక సంఖ్యలో భద్రత బలగాల శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2019 దరిమిలా అటువంటి 250 శిబిరాల ఏర్పాటు జరిగిందని, భద్రత అంతరం పరిహారం అయిందని అమిత్ షా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News