Sunday, January 19, 2025

కెఆర్ఎంబి సూచన మేరకు నడుచుకుంటాం

- Advertisement -
- Advertisement -

డ్యామ్ సిిఇ అజయ్ కుమార్ 

కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆ దేశాల ప్రకారమే నడుచుకుంటామని డ్యాం సిఈ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతం లో ఆంధ్రాకు 15 టిఎంసిల నీటిని మూ డు విడతల్లో విడుదలకు ఒప్పదం జరిగిందని, అందులో భాగంగా అక్టోబర్ 5న టి ఎంసిల నీటిని విడుదల చేశామని, రెండవ విడత జనవరిలో, మూడో విడత ఏ ప్రిల్ 2024లో నీరు విడుదల చేయాల్సి ఉం దని, అంతలోనే కెఆర్‌ఎంబి సూచనకు వి రుద్ధంగా ఎపి నీటిని విడుదల చేసిందన్నా రు. నవంబర్ 30వ తేదీన అక్రమంగా చే సిన దాడిలో కెమెరాలు, ఆటోమేటిక్ గేట్ సిస్టం ధ్వంసం చేశారని, బారీ కేడ్లను మరి యు కంచెను ఏర్పాటు చేసి తెలంగాణ డ్యామ్ అధికారులను, సిబ్బందిని రాకుం డా కంట్రోల్ రూమ్‌ను ఎపి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న నిబంధనలకు ఇది వ్యతిరేకమన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News