Thursday, January 23, 2025

స్వంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

మైసూరు: 224 సభ్యుల కర్నాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 120 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేసినప్పటికీ కర్నాటక ప్రజలపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆయన అన్నారు. కర్నాటకకు మోడీ, అమిత్ షా, జెపి. నడ్డా లాంటి బిజెపి ప్రముఖులు వచ్చి ప్రచారం చేసినప్పటికీ ప్రభావం అంతంత మాత్రమేనన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది.
కర్నాటక ప్రజలు బిజెపి విధానాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక దుష్పరిపాలనతో విసిగిపోయారని ఈ సందర్భంగా సిద్దరామయ్య తెలిపారు. కాగా ఓబిసి వర్గానికి చెందిన సిద్దరామయ్యే తదుపరి ముఖ్యమంత్రి కావొచ్చని అనుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News