Sunday, January 19, 2025

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరతాం: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పార్టీల గెలుపు తథ్యమని, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని ఏర్పాటు చేశాననీ, ఇతర పార్టీలనుంచి నాయకులను తీసుకోకుండా పార్టీని నడుపుతున్నానని చెప్పారు. వెనుకబడిన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.

బీసీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధులు బీసీలకే ఇవ్వాలనీ, కానీ కులాలకు కేటాయించిన నిధులు ఆ కులాలవారికి అందడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని చూడనివారికి అధికారం అప్పగించడమే సాధికారతకు అర్ధమని పవన్ అన్నారు. మాటలు చెప్పడం తన నైజం కాదనీ, మాట ఇస్తే దానిపై నిలబడి చూపిస్తానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News