- మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రేకులకుంట ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలను రేకు లకుంట ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఆలయ సిబ్బంది ఒగ్గు పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎంపి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు.
వచ్చే సంవత్సరంలోపు రేకులకుంట ఎల్లమ్మ మల్లికార్జున దేవస్థానాన్ని అధునాతన హంగులతో అత్యంత వైభవోపేతంగా నిర్మించడానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూందన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న సిఎం కెసిఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని ప్రజలందరూ రైతులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో సుఖసంతోషాలతో జీవించాలని రేకులకుంట ఎల్లమ్మ మల్లికార్జున స్వామి లను వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి పాలకమండలి చైర్మన్ రొట్టె రమేష్, మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ,జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, ఎంపిపి కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నే వనిత భూమి రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మ రజిత , నందాల శ్రీజ , దేవుని లలిత, ఆస యాదగిరి, బాలకృష్ణ, శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు ఆస స్వామి, దేవాలయ పాలకమండలి సభ్యులు, బిఆర్‌ఎస్ నాయకులు పల్లె రామస్వామి గౌడ్, దేవుని చెంద్రయ్య, ఆలయ సిబ్బంది భూపతి రెడ్డి, మహేందర్ రెడ్డి ,రామ్ రెడ్డి , వంశీధర్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు పాల్గొన్నారు.