Thursday, January 23, 2025

అణ్వాయుధ సంపత్తిని మరింత బలోపేతం చేస్తాం

- Advertisement -
- Advertisement -

We will further strengthen nuclear arsenal:Kim

సైనిక పరేడ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ

సియోల్ : తమ అణ్వాయుధ సంపత్తిని వీలైనంత వేగంగా మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. ఎవరైనా తమను రెచ్చగొడితే అణు బాంబులేస్తామంటూ దక్షిణ కొరియాను పరోక్షంగా హెచ్చరించారు. ఉత్తర కొరియా ఆర్మీ 90 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని ప్యాంగ్యాంగ్‌లో సోమవారం రాత్రి భారీ ఎత్తున సైనిక పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌లో దేశ అత్యంత శక్తిమంతమైన, అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. ఈ సందర్బంగా కిన్ మాట్లాడుతూ “మా అణ్వాయుధ బలగాల ప్రాథమిక లక్షం యుద్దాన్ని అరికట్టడమే. కానీ అవాంఛనీయ పరిస్థితులు మా గడ్డపై ఏర్పడితే మాత్రం అణ్వాయుధ ప్రయోగం ఒకే మిషన్‌కు పరిమితం కాదు. శత్రువులెవరైనా సరే మా ప్రాథమిక ప్రయోజనాలను ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే మా అణుదళాలు ఊరుకోవు. రెండో మిషన్ (అణ్వాయుధ ప్రయోగం) తప్పదు. ” అని హెచ్చరించారు.

మిలిటరీ పరేడ్‌లో భాగంగా ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వాయుధాలను , క్షిపణులను ప్రదర్శించారు. ఇందులో ప్రధానంగా ఆకట్టుకున్నది హ్వాసంగ్ 17 ఖండాంతర క్షిపణి (ఐసిబిఎం) . ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధిలో అమెరికా భూభాగం మొత్తం ఉండటం విశేషం. ఇది ఆరు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. కరోనా మహమ్మారితో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా క్షిపణి ప్రయోగాల్లో మాత్రం ఉత్తర కొరియా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News