Thursday, January 23, 2025

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ హామీ

హైదరాబాద్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ అంశం ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలనలో ఉందన్నారు. అసెంబ్లీ లాబీలో గురువారం మంత్రి కెటిఆర్‌ను డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డిజేహెచ్‌ఎస్) అధ్యక్షుడు బొల్లోజు రవి, ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్, డైరెక్టర్లు డేగ కుమార్, ప్రతాప్ రెడ్డి, దండా రామకృష్ణ, సలహాదారు విక్రమ్‌రెడ్డి, సభ్యులు వేములపల్లి రాజు, పోలంపల్లి ఆంజనేయులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కెటిఆర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డిజెహెచ్‌ఎస్ గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన తొలి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డిజెహెచ్‌ఎస్ అని ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాగా, జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంపై సిఎం కెసిఆర్‌తో మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News