Monday, December 23, 2024

ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తాం : చౌహాన్

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం పెద్దపీట వేస్తామని రాచకోండ సీపీ డిఎస్ చౌహాన్ అన్నారు. ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ట్రాఫిక్ ,రోడ్డు భద్రత విభాగం అధికారు లు, ట్రాఫిక్ సిబ్బంది భద్రతపై సమీక్షా సమావేశం మంగళవారం సీపీ చౌ హాన్ నిర్వహించారు. ట్రాఫిక్ సిబ్బంది రక్షణ కోసం అధునాతన కమ్యూనీకేషన్, కిట్ ఆర్టికల్స్ కిట్టులు, భద్రతా పరికరాలను సిబ్బందికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2 కోట్ల విలువైన ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలు బారికేడ్స్, కోన్స్, బోల్లారెడ్లు, కిట్ బ్యాగులు, సేఫ్ట్టీ హెల్మెట్స్, ఎసి హెల్మెట్‌లు, సన్ గ్లాసెస్, రెయిన్ కిట్స్, జంగిల్ షూస్ , వా టర్‌బాటిల్, రిప్లెటివ్ జాకిట్స్, ఎల్‌ఈడి బ్యాటన్లు, 56 ల్యాప్టాప్‌లు కిట్స్ ఆర్టికల్స్‌ని సిబ్బందికి అందజేశారు. ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు చైన్ స్నాచింగ్ పాల్పడిన, నెంబర్ ప్లేట్స్ ఉల్లంఘనపై ప్రత్యేక డైవ్‌లో భాగంగా మొత్తం 69, 420కేసులు నమోదు చేసామని తెలిపారు.

ఇందులో 199 ఎఫ్‌ఐఆర్‌లు, పాత నేరస్థులపై ఛార్జిషీట్లు 407కేసులు, 13మందికి జైలు శిక్ష, 55 మంది సామాజిక సేవ, కోర్టు శిక్షలు వేసారని తెలిపారు. దీంతో మొత్తం రూ. ఒక కోటి 56 లక్షల 82 వేల 800 రూపాయలు కోర్టులు జరిమానా వేసిందన్నారు. జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు డంక్రెన్ అండ్ డ్రైవ్ మొత్తం కేసులు 9,991, 132 మందికి జైలు శిక్ష విధించడం, 242 మం దికి సామాజిక సేవ విధించడం జరిగిందన్నారు. డంక్రన్ అండ్ డ్రైవ్ ద్వారా మొత్తం రూ.2 కోట్ల 43 లక్షల 10 వేల 071 రూపాయలు జరిమానా వసూలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ సత్యనారయణ, ట్రాఫిక్ డిసిపి అభిషేక్ మహంతి, ట్రాఫిక్ డిసిపి 1 శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ2 శ్రీనివాస్ కూమార్, ఏసీపీ ట్రాఫిక్ హరికృష్ణలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News