Sunday, January 12, 2025

మహిళలందరికీ ప్రతి నెలా రూ.2,100 ఇస్తాం: కేజ్రీవాల్‌

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మహిళలకు మాజీ సీఎం శుభవార్త చెప్పారు. తాము  మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తామని కేజ్రీవాల్‌ ప్రకటించారు.

గతంలోనే నెలకు రూ.వెయ్యి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం కూడా బుధవారం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కానీ, ద్రవ్యోల్బణం కారణంగా ఆ మొత్తం చాలదనే విషయాన్ని కొందరు మహిళలు తమ దృష్టికి తీసుకొచ్చారని.. అందుకే నెలకు రూ.2,100 ఆర్థిక సాయం ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటన చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని మాజీ సీఎం కేజ్రీవాల్ హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News