విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులు, సిబ్బందికి
ప్రోత్సాహాకాలు అందిస్తాం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎక్సైజ్ అధికారులు సుమారు రూ.2 కోట్లకు పైగా విలువగల గంజాయిని పట్టుకున్నందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వారిని అభినందించడంతో పాటు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, మత్త పదార్థాలు లేకుండా పూర్తిగా నిర్మూలించాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహాకాలను అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, కృష్ణయాదవ్, వెంకటయ్య, సహదేవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.