Monday, December 23, 2024

నగరాభివృద్ధిపై ఎంత దూరమైనా వెళ్తాం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ : నగరాభివృద్ధిపై ఎంత దూరమనా వెళ్తామని, నాలాలపై అక్రమ కట్టడాలు నిర్మిస్తే సహించే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హన్మకొండ నయీంనగర్‌లోని పెద్ద నాలాపై చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం అక్రమ నిర్మాణం చేశారన్నారు. 2016 సెప్టెంబరులో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా అక్రమంగా కట్టిన నిర్మాణాల వల్ల ప్రవహించే నీరంతా నయీంనగర్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరాయి. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి నీరు నాలాల గుండా ప్రవహించే విధంగా చూడాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు అందరితో కలిసి నాలాల పర్యవేక్షణకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో చైతన్య డిగ్రీ కళాశాల యజమాని పురుషోత్తంరెడ్డి ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకంతో ఈ తప్పుడు ఆరోపణలపై పురుషోత్తంరెడ్డిపై పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఈరోజు హన్మకొండ జిల్లా కోర్టులో జడ్జికి సాక్షాదారాలు అందించడం జరిగింది. ఈనెల 24న మళ్లీ కోర్టుకు హాజరుకావాలని జడ్జి సూచించడం జరిగింది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారే ఇలా నా లాంటి ప్రజాప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News