- ఐటి శాఖ మంత్రి కేటిఆర్
షాబాద్: చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్‌వెళ్లి పారిశ్రమికవాడలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ శంకుస్థాపనకు, స్థానిక చేవెళ్ల కాలె యాదయ్య, ఎంపి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిలతో కలిసి వచ్చిన కెటిఆర్‌ను భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో కలిసి తమకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ భూ నిర్వాసితులకు అందరికి నష్టపరిహారం ఇచ్చి తర్వాత ఇంటికో ప్లాట్, ఉద్యోగం ఇవ్వాలన్నారు. అందుకు మంత్రి కెటిఆర్ సానూకులంగా స్పందిస్తూ వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి చెప్పడం జరిగిందన్నారు. తర్వలోనే నష్టపరిహారం అందని భూ నిర్వాసితులకు పరిహారం అందిస్తామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు నీరటి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు సుప్పాలి, నర్సింలు, భూ నిర్వాసితులు ఆనంతం, రాంబాబుగౌడ్, రంగయ్య, అంజయ్య, రాంచంద్రయ్య, విట్టల్, గోపాల్, నర్సింలు తదితరులు ఉన్నారు.