Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం : రొమేనియా

- Advertisement -
- Advertisement -

We will help Ukraine: Romania

కీవ్ : ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం చేస్తామని రొమేనియా ప్రకటించింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే రొమేనియా ఉంది. ఇప్పటికే తమ దేశ సరిహద్దుకు చేరిన ఉక్రెయిన్ పౌరులకు రొమేనియా సాయం అందిస్తోంది. ఈ సాయాన్ని మరింత పెంచేందుకు ముందుకొచ్చింది. ఉక్రెయిన్‌కు 3.3 మిలియన్ డాలర్ల విలువైన సహాయం అందిస్తామని చెప్పింది. తమ దేశం నుంచి మంచినీళ్లు, చమురు, హెల్మెట్, మిలిటరీ సామగ్రి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆహారం వంటి సామగ్రిని అందిస్తామని వెల్లడించింది. దాడుల్లో గాయపడిన పౌరులకు సైన్యానికి వైద్య సాయం అందిస్తామంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News