Monday, December 23, 2024

మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:బూత్ స్థాయినుండి పార్టీని బలోపేతం చేసి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లమల కృ ష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు మండల పరిధిలోని సింగారం ,ఉకోండి గ్రామాల నుండి వివిద పార్టీల కార్యకర్తలు చలమల్ల సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిద కారణాల చేత పార్టీకి దూరమైన వారిని తిరిగి పార్టీలో చేరేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రజా సమస్యల పరష్కారం కోసం కార్యకర్తలు, నాయకులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన వారిలో మానుపాటి సత్యనారాయణ, వేముల నరసింహగౌడ్, చెదురువెల్లి నాగరాజు, పాలకూరి మధు, బొడ్డుపల్లి సాయి, బోయపల్లి రజనీకాంత్, జాల హరికృష్ణ, చెదురువెల్లి మహేష్‌గౌడ్,తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండలంపార్టీ అధ్యక్షుడు సురిగి నరసింహగౌడ్, నాయకులు బొమ్మగాని అనిల్‌గౌడ్, పగిళ్ల శ్రీనివాస్, కందుల సూర్యప్రకాష్ గౌడ్, జాల చందుయాదవ్, జింకల మారయ్య, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News