Monday, December 23, 2024

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. కులగణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ సోమవారం సీడబ్లుసి సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వర్కింగ్ కమిటీ భేటీలో తాము కులగణనపై విస్తృతంగా చర్చించామని, ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు ఇచ్చారని చెప్పారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కులగణన సర్వేలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సీడబ్లుసి సమావేశంలో రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్‌చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కులగణన తోపాటు త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక అంశాలపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News