Thursday, January 23, 2025

తెలంగాణ పథకాలను అమలు చేస్తాం

- Advertisement -
- Advertisement -

హిమాచల్‌ప్రదేశ్ సిఎస్ రామ్‌సుభాగ్ సింగ్

We will implement Telangana schemes

మనతెలంగాణ/హైదరాబాద్: వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న అత్యుత్తమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయనున్నామని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్‌సింగ్ తెలిపారు. సోమవారం నగరంలోని బిఆర్‌కెఆర్ భవన్‌లో సచివాలయ అధికారులను ఆయన కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్‌కు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్లాగ్ షిప్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచనల మేరకు ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ , వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం. రిజ్వీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆయనకు వివరించారు. సమావేశంలో ప్రోటోకాల్ విభాగం అదనపు కార్యదర్శి అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News