Friday, December 27, 2024

తెలంగాణలో పెట్టుబడులు పెడతాం

- Advertisement -
- Advertisement -

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన కెనడా పారిశ్రామిక వేత్తలు
స్వాగతించిన మంత్రి

మన తెలంగాణ / హైదరాబాద్: కెనడాలో ప్రఖ్యాతి గాంచిన స్మైల్ డిజిటల్ హెల్త్ సిఇవో , డంకన్ వెస్ట్రన్ బేస్డ్ ఎస్‌ఆర్‌ఎ ఇన్ఫర్‌మేషన్ సంస్థకు చెందిన రాయ్, హుస్సేన్‌లు శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. హెల్త్ డేటా ఆధారిత కార్యక్రమాల కోసం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రతినిధులు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో 500 నుండి 1200 ఉద్యోగ అవకాశాలను సృష్టించే విధంగా, హైదరాబాద్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News