Wednesday, January 22, 2025

అభివృద్ధిలో సికింద్రాబాద్‌ను అగ్రగామిగా నిలుపుతాం : పద్మారావు

- Advertisement -
- Advertisement -

తార్నాక: తార్నాకలోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో రూ.2.60 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ మాట్లాడుతూ తార్నాక – లాలాపేట రోడ్డు రద్దీగా మారి రోడ్డును దాటేందుకు విద్యార్ధులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద రూ.2.60 కోట్ల ఖర్చుతో అధునాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించినట్లు తెలిపారు. పాదచారుల భద్రతలో భాగంగా ఇంతకాలంఅటు, ఇటు రోడ్డు దాటేందుకు పడ్డ నగరవాసుల బాధలను తొలగించేందుకు నిర్మించిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్థానికులు సద్వినియోగం చేసుకోగలరని సూచించారు.

సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సదుపాయాలను కల్పించడంలో తాము ముందు ఉంటామని తెలిపారు. స్థానిక రద్దీ పరిస్థ్థితులను దృష్టిలో ఉంచుకొని ఆలుగడ్డ బావి, సుదర్శన్ రెడ్డి స్వీట్ ప్రాంతాల్లో కూడా మరో రెండు పుట్ ఓవర్ బ్రిడ్జిలను కొత్తగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. అదే విధంగా చిలకలగూడ క్రాస్‌రోడ్స్ వద్ద కూడా స్కై వాక్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మునిసిపల్ మంత్రికి ప్రతిపాదనలను అందించామని తెలిపారు. చిలకలగూడ (మెట్టుగూడ రోడ్డు,), మనికేశ్వరి నగర్ ప్రాంతాల్లో రూ.50కోట్ల ఖర్చుతో రెండు ఆర్‌యుబిలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను అందించామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీటి నిర్మాణానికి అనుమతి లభించిందని పద్మారావుగౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ గ్రేటర్ పీఠాన్ని అధిరోహించిన ఈ 9 ఏళ్ల కాలంలో ఎవరూ ఊహించనంత హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాసురి సునీత రమేష్, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మిశ్రీనివాస్, కంది శైలజ, బిఆర్‌ఎస్ నేతలు మోతే శోభన్ రెడ్డి, కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరద్, ఈ ఈ ఆశలతలతో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News