దేవరకొండ: మర్రిచెట్టుతండాను నాటుసారా రహిత గ్రామం గా తీర్చిదిద్దమే లక్షంగా పనిచేస్తున్నామని ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం దేవరకొండ ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మర్రిచెట్టుతండాలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నాటుసారా కాచినా, ముడిసరుకులు రవాణాచేసి చట్టరీత్యా నేరమని, శిక్షార్హులవుతారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
నాటుసారా వలన ఆరోగ్యం, కుటుంబ సంసారాలు చెడిపోయి రో డ్డున పడుతారని అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరైనా సారా తయారీ, ముడిసరుకు రవా ణా చేస్తే ఎక్సైజ్‌శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువకులు, ప్రజలు ఈ విషయమై అవగాహన కలిగి ఉండి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు నేనావత్ శ్రీనునాయక్, గ్రామస్థులు, ఎక్సైజ్‌శా ఖ సిబ్బంది ఉన్నారు.