Saturday, December 21, 2024

మన్యంకొండను అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో నెలకొన్న మన్యంకొండ దివ్య క్షేత్రాన్ని అద్భుతమైన క్షేత్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం మన్యంకొండ వద్ద రూ. 15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర హరిత హోటల్ , శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకపూర్వం మన్యంకొండ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చిన భ క్తులకు కనీసం స్నానం చేసేందుకు, తాగడానికి సై తం మంచినీరుండేది కాదని, కోనేటిలో స్నానాలు ఆచరించిన వారందరికీ జబ్బు చేసేదని, కృష్ణ నది లో మునులు స్నానమాచరిస్తుండగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం దొరికిందని, అలాంటి విగ్రహాన్ని ప్రతి రోజు కృష్ణా జలాలతో పునీతం చేయాలన్న సంకల్పంతో కృష్ణ నది నీటిని మిషన్ భగీరథ ద్వారా కొండపైకి తీసుకువచ్చి ప్రతి రోజు అభిషేక ం చేస్తున్నామని తెలిపారు.

ఇక్కడికి వచ్చే భక్తుల కో సం కళ్యాణ మండపాన్ని నిర్మించామని, అదేవిధంగా కొండపైన 18 రూములతో ఏసి వసతి సదుపాయం కల్పించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ంలో మొట్ట మొదటి రోప్ వేను ఇక్కడ నిర్మించనున్నామని, సంవత్సరంలోపు ఇది పూర్తవుతుందని తె లిపారు. అంతేకాక కర్ణాటక, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి మన్నెంకొండకు వ చ్చే భక్తుల కోసం రూ. 15 కోట్లు వెచ్చించి శ్రీ వెంకటేశ్వర హరిత హోటల్‌ను, అదే విధంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామని, సం వత్సరంలోపు ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు.

వచ్చే సంవత్సరం నాటికి సామూహిక వివాహాలు జరిపించడమే కాకుండా, ఎవరైనా వ్యక్తిగతం గా వివాహాలు జరుపుకునేందుకు అన్ని సౌకర్యాలతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్, మన్నెంకొండ దేవాలయం చైర్మన్ అలహరి మధుసూదన్‌కుమార్, ఎంపిపి సుధా శ్రీ , వైస్ ఎం పిపి అనిత, పిఏసిఎస్ డైరెక్టర్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు అల్లావుద్దీన్, తహసీల్దార్ పాం డు, ఎంపీడీఓ , టూరిజం , డీఈ పరుషవేది, ఏఈ మధు, మన్యంకొండ దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News