Sunday, January 19, 2025

జిల్లా క్లబ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ క్లబ్‌ను అత్బుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కొత్త హంగులతో అత్యాధునికంగా మారుస్తామన్నారు. జిల్లా క్లబ్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. క్లబ్ ఆధునీకరణ కోసం నిధులు కేటాయించాలని క్లబ్ కార్యవర్గ సభ్యులు మంత్రిని కోరగా ఆదునిక భవనాల నిర్మాణం కోసం రూ. 1.50 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.

క్లబ్ వద్ద జరుగుతున్న పనులను ఆయన క్లబ్ పాలకవర్గంతో కలిసి పరిశీలించారు. సంఘం వ్యతిరేక శక్లుకు క్లబ్‌లో సభ్యుత్వం ఇవ్వకూడదని తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జిల్లా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కె. ప్రతాప్‌కుమార్, మల్లు నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News