Sunday, December 22, 2024

ప్రవళ్లిక ఆత్మహత్యపై గవర్నర్‌ను కలుస్తాం : డాక్టర్ లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉద్యోగం రాక ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు ఎఫైర్ అంటగడతారా అంటూ పోలీసులపై బిజెపి ఎంపి లక్ష్మణ్ మండిపడ్డారు. శనివారం బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కలుస్తామని ఆయన చెప్పారు. ప్రవళ్లిక ఆత్మహత్యే బిఆర్‌ఎస్ పతనానికి నాంది అని లక్ష్మణ్ విమర్శించారు.

నిరుద్యోగి ఆత్మహత్యపై ఆందోళన చేసిన యువతపై పోలీసులు అడ్డగోలుగా లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపించారు. అమ్మాయిది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం కదలి వచ్చిందన్నారు. కుటుంబంలో మనోధైర్యం నింపకుండా పోలీసులతో లవ్ ఫెయిల్యూర్ అని అబద్ధాలు చెప్పిస్తున్నారు. తప్పుడు ప్రకటనల వల్ల ఆ కుటుంబం కుమిలిపోతోందన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News