మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మానవ హక్కుల వేదిక నాయకుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ హక్కుల కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసి సోదాలు చేయడం పట్ల ఆసంఘం సమన్వయ కమిటీ సభ్యులు జీవన్‌కుమార్, వి.ఎస్.కృష్ణ ఖండించారు. ఆంద్రప్రదేశ్‌లో అదోని, అమలాపురం, అనంతపురం, ఎమ్మిగనూర్,విశాఖపట్నం సోదాలు చేసి జైల్‌లో నిర్భందించేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. దర్యాప్తులో నేర నిరూపణకు దోహదపడే పత్రాలు, వస్తువులు దొరుకుతాయనే తలంపుతోనే ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించిందని ఆరోపించారు.
మా ఏడుగురు కార్యకర్తల ఇళ్లపై సుమారు 6 గంటల పాటు చేసిన సోదాల ద్వారా ఎన్‌ఐఎ సిబ్బంది సాధించింది ఏమిలేదని మా దగ్గర నుంచి 5 మొబైల్ పోన్లు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, సాహిత్య స్వాధీనం చేసుకోవడం వారి పనులకు విఘాతం కలిగిస్తుందన్నారు. ఎన్‌ఐఏ తన ప్రకటనలో మా కార్యకర్తలను మావోయిస్టుల అనుబంధ సంస్థగా అభివర్ణించిందని ఇంతకంటే పచ్చి అబద్దం మరొకటి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో మానవ హక్కుల సంస్కృతిని పెంపొందించడానికి చేసే ప్రయత్నాలలో ఎవరు ఎన్ని అవాంతరాలు కలిగించినా తమ పని మరింత ధృడ సంకల్పంతో ముందుకు కొనసాగిస్తామని పేర్కొన్నారు.